ఊరించి ఉసూరుమనిపించిన పవన్ ?

రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ( Janasena )కి ఒక విశిష్టత ఉంది.వేరే ఏ పార్టీకి లేనంత యువత మద్దతు ఆ పార్టీ సొంతం.

అంతేకాకుండా తన రాజకీయ సభలకు ఒక్క రూపాయి పంచకుండానే లక్షల మందిని సమకూర్చగల చరిష్మా జనసేనాని సొంతం.

సినిమా రంగంలో అగ్ర నటుడు అవ్వడం ఒక కారణమైతే, విలక్షణమైన తన వ్యక్తిత్వం, నిజాయితీ చాలామందిని ఆకర్షిస్తుంది.

అందువల్లే 2019లో అంత ఘోర పరాజయం తర్వాత కూడా అత్యంత వేగంగా తన పార్టీని తిరిగి నిలబెట్టగలిగాడు అంటే పవన్ కి ఉన్న ఆ యూనిక్ ఫ్యాన్ బేస్ మాత్రమే దానికి కారణం.

‘గెలిస్తే న్యాయం చేస్తాం ఓడితే సాయం చేస్తాం” అన్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న జనసైనికులు తమకు రాజకీయ అధికారం లేకపోయినా ప్రజా సమస్యలను తమకు చేతనైన మార్గంలో పరిష్కరించిన ఉదంతాలు అనేకం చూసాం.

"""/"/ తాను 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని తక్షణ అధికారం తన లక్ష్యం కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే జనసేన పాటుపడుతుందని పవన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

దాంతో 2024 లో గణనీయమైన సీట్లు సాధించి ముఖ్యమంత్రి కాలేయకపోయినా 2029లో మాత్రం ఖచ్చితంగా జనసేనకు అధికారం వస్తుందంటూ లక్షల మంది కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు .

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు( Janasena MLAs ) అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతారని చాలామంది నమ్మకంగా ఉన్నారు.

"""/"/ అలాంటి వారందరికీ ఈరోజు పవన్ ప్రకటన తొందరపాటు చర్యగా కనిపించింది అన్నది వాస్తవం .

చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు పవన్ సామాజిక వర్గ యువత కూడా నిరాశ చెందినట్లుగా వారి సోషల్ మీడియా పోస్టులను చూస్తుంటే అర్థమవుతుంది .

నిజానికి రెండు పార్టీల మధ్య పొత్తు అంటే అనేక లెక్కలు ఉంటాయి.ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకును( Vote Bank ), సామాజిక సమీకరణాలను తేల్చుకొని పొత్తులను ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది.

భావోద్వేగ నిర్ణయాలు రాజకీయాలలో సరిపడవు .మరి అత్యంత చాకచక్యంగాను పూర్తిస్థాయి సమాలోచనలు విధి విధానాలతోనూ తీసుకోవలసిన నిర్ణయాన్ని ఒక 40 నిమిషాల భేటీతో పవన్ తేల్చేయడంతో జనసైనికుల్లో అయోమయం నెలకొంది.

ఇంతకాలం తాము పడిన కష్టం, కేటాయించిన తమ విలువైన సమయం చివరికి తెలుగుదేశం జెండా మోయడానికా? అంటూ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్( Social Media Platforms ) లో ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తుంది.

మరి పవన్ ది తొందరపాటు చర్యనా లేక భవిష్యత్తు వ్యూహమో మరో కొన్ని రోజుల్లో ఒక అవగాహనకు రావచ్చు.

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?