టీడీపీ కి పొత్తులు అవసరం లేదా ? బాబు ప్రకటనపై గందరగోళం ?

ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు నిన్న కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించారు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా సరే.బాబు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు ఇంత తొందర పడి బాబు ఎందుకు ఈ ప్రకటన చేశారు అనేది టిడిపి నాయకులకు సైతం అర్థం కావడం లేదు.

రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అంటే .బలంగా ఉన్న వైసీపీ ని ఓడించాలంటే కచ్చితంగా పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని బాబు గుర్తించారు.

అందుకే తమతో దూరం పాటిస్తున్న బీజేపీతో పాటు,  జనసేన ను కలుపుకుని మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని చాలాకాలంగా బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేన,  బీజేపీ ఒప్పుకుంటే పొత్తులో భాగంగా కొరినన్ని స్థానాలను కూడా కేటాయించేందుకు సిద్ధమని సంకేతాలను ఇచ్చారు .

"""/"/  ఈ విషయంలో బిజెపి పొత్తుకు ససేమిరా అంటున్నా,  జనసేన మాత్రం ఇంకా ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు.

ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పదేపదే వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చడం తనకు ఇష్టం లేదని చెబుతూ.

పొత్తులకు సానుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు.ఒకవైపు ఈ వ్యవహారం ఈ విధంగా ఉండగానే , చంద్రబాబు టిడిపి అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యంగా జనసేనకు మింగుడు పడడం లేదు.

ఒకవైపు తమతో పొత్తుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే , ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా టిడిపి అభ్యర్థిని చంద్రబాబు ఏ విధంగా ప్రకటించారు ? తమతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారనే  ఈ విషయాన్ని జనసేన శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయి.

ప్రస్తుతం  చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే కేవలం నియోజకవర్గానికి మాత్రమే తన ప్రకటన పరిమితం కాకుండా,  మిగతా నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉండడంతో జనసేన వర్గాలు బాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి.

భార్యల సీటు కోసం బస్సులొ చెప్పులతో కొట్టుకున్న భర్తలు