పుష్ప2 విషయంలో నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా.. యూటర్న్ తీసుకున్న జనసేన నేత!
TeluguStop.com
అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా విడుదలవుతున్న సమయంలో ఈ సినిమాకు కాస్త పొలిటికల్ సెగ కూడా తగిలిందని చెప్పాలి.
ఎంతోమంది జనసేన నేతలు ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.ఈ క్రమంలోనే గన్నవరం జనసేననేత చలమలశెట్టి రమేష్ బాబు ( Chalamalasetty Ramesh Babu ) ఏకంగా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ఎన్నికల ప్రచారాలలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి ( Pawan Kalyan ) కాకుండా తన స్నేహితుడికి మద్దతు తెలుపుతూ అహం ప్రదర్శించారు.
ఈయన వ్యవహారం కారణంగా జనసైనికులు మెగా అభిమానులు బాధపడ్డారు. """/" /
ఇలా అహం నెత్తిన పెట్టుకొని ప్రవర్తిస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, నాగబాబు చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకోండి లేకపోతే మీ సినిమాని విడుదల కానివ్వము అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై బన్నీ ఫాన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
అయితే తాజాగా ఈయన ఈ సినిమా విషయంలో మరొక వీడియోని విడుదల చేశారు.
"""/" /
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విషయంలో నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కామెంట్ లు చేశారు.
ఇలా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి కారణం నాగబాబు( Nagababu ) గారని తెలిపారు.
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎవరి వృత్తులకు, వ్యాపారాలకు జనసేన అడ్డుపడదన్న సందేశాన్ని నాగబాబు గారు ఇవ్వడంతోనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఈయన తెలియజేశారు.
ఇలా జనసేన నేత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి బన్నీ ఫ్యాన్స్ ఈయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!