మూడో విడత వారాహి యాత్రకు జనసేనాని సిద్ధం..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆగస్ట్ 3 లేదా 5వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇవాళ సాయంత్రం ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేనాని వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రకు చేయాల్సిన ఏర్పాట్లు, యాత్ర నిర్వహించే తేదీలు మరియు రూట్ మ్యాప్ ను నాయకులతో కలిసి ఖరారు చేయనున్నారు.

అదేవిధంగా మూడో విడత వారాహి యాత్రను రాజమండ్రి లేదా ఉత్తరాంధ్రలో ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.