పవన్ అదే నిజం చేస్తున్నారుగా ? ఇబ్బందేగా ?
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సునామీ సృష్టించాలి అని చూస్తున్నారు.
2014 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా, టిడిపి బీజేపీలకు మద్దతు పలికింది.
ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి టిడిపి బిజెపిల ను పక్కన పెట్టి వామపక్ష పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా, కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే జనసేన కు దక్కింది.
కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తాను తప్పకుండా సీఎం అవుతానని, అది జరగాలి అంటే జనసేన ఒంటరిగా ఈసారి పోటీ చేస్తే లాభం ఉండదు అని, వైసీపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లి, తమ సత్తా చాటుతామని పవన్ ఇటీవల ప్రకటించారు.
ఇక ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేయడంతో పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారు, జనసేన ను ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయిలు తీర్చిదిద్ది 2024 ఎన్నికల్లో కీలకం చేసే విధంగా పవన్ వ్యవహరిస్తారని అంతా భావించారు.
అయితే పార్టీ ఆవిర్భావ సభకు ముందు, తర్వాత పవన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మళ్లీ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.దీంతో మళ్లీ జనసేన కార్యకలాపాలు మొదటికి వచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి.
ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ పవన లేని లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్న, క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటన చేపట్టి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే జనసేనకు వచ్చే మైలేజ్ అంతా ఇంతా కాదు.
కానీ పవన్ మాత్రం పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించనట్లు గానే వ్యవహరిస్తున్నారు.
పవన్ ది నిలకడ లేని రాజకీయమని, పార్ట్ టైం పాలిటిక్స్ అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు.
దానిని నిజం చేసే విధంగానే పవన్ వ్యవహారశైలి ఉండడం జనసేన కు ఇబ్బందికరంగా మారింది.
"""/" /
మొదటి నుంచి పవన్ ఈ విషయంలోనే సీరియస్ గా దృష్టి పెట్టకపోవడం తో జనాలలోను అదే అభిప్రాయం కలుగుతోంది.
పవన్ ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించికపోతే, 2024 ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు జనసేన నాయకులు నుంచే వ్యక్తమవుతున్నాయి.
నాకు రాజకీయాలు తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే.. పూనమ్ కామెంట్స్ వైరల్!