జగన్ అమాయకుడు.. న్యాయం చేయాలి.. వైరల్ అవుతున్న నాగబాబు సంచలన ట్వీట్!
TeluguStop.com
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోగా కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే కూటమి ప్రభుత్వం గెలిచి కనీసం నెలలు కూడా కాకముందే అప్పుడే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పోరాటాల బాట పట్టారు.
కూటమిపై విరుచుకుపడుతూ ప్రజల్లో ఏదో ఒక రకంగా జోష్ నింపాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కుటుంబ ప్రభుత్వం పై భారీగా విమర్శలు గుప్పించడంతోపాటుగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి అంటూ అనేక రకరకాల ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 31 హత్యలు జరిగాయని, వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని,1050 దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
"""/" /
అయితే గత వారం పల్నాడు జిల్లా వినుకొండలో షేక్ రషీద్ ( Shaik Rasheed )హత్య వార్త తెలుసుకున్న జగన్ రెడ్డి బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన తాడేపల్లికి బయల్దేరి వచ్చారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు మందీ మార్భలంతో వెళ్లిన విషయం తేలిసిందే.అక్కడితో ఆగకుండా ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక పరిస్ధితులపై దేశ రాజధాని ఢిల్లీలో దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారని, రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దాడులను , హత్యలను ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని అన్నారు.
"""/" /
అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.
వైసీపీ అధినేతపై సెటైర్లు వేస్తూ, ఆరోపణలు చేస్తున్న ఆయన మొన్న ఆ మధ్య వినుకొండ ఘటనపైనా స్పందించారు.
తాజాగా ఐదేళ్ల క్రితం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడిపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.
ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు.
5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు.అప్పుడంటే జగన్ కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు.
ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు.కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది.
కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా.
కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సిఎం గారిని, డిప్యూటీ సిఎం గారిని, హోం మంత్రి గారిని కోరుకుంటున్నాను అంటూ నాగబాబు( Nagendra Babu ) సెటైరికల్‌గా ట్వీట్ చేసారు.
నాగబాబు చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచు మనోజ్ కు షాకిచ్చేలా లేఖ రాసిన తల్లి.. ఈ హీరో ఒంటరివాడు అవుతున్నాడా?