కేంద్రమంత్రి పై జరిగిన దాడిని ఖండించిన జనసేన..!!
TeluguStop.com
బెంగాల్ రాష్ట్రంలో ఉదయం కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
జరిగిన దాడిని.ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బెంగాల్ గవర్నర్.
వివరణ ఇవ్వాలని నివేదిక అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ఉద్దేశించి.
దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి చెందిన నేతలు నిన్న నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన పార్టీ కూడా తాజా ఘటన పై స్పందించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సరికొత్త ప్రకటన విడుదల చేశారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు దురదృష్టకరమని.బాధాకరమని.
వెంటనే ప్రజాస్వామ్యవాదులు అందరూ దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.ఇదిలా ఉంటే కావాలని బిజెపి నేతలు గొడవలు సృష్టించి.
బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు.బీజేపీ నేతలు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని టిఎంసి పార్టీకి చెందిన నేతలు వస్తున్న ఆరోపణలపై కౌంటర్లు వేస్తున్నారు.
ఏది ఏమైనా బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
యూకే: ఈ గుడ్డు చాలా స్పెషల్.. అందుకే ఈ ధరకు అమ్ముడుపోయింది..?