టీ సీఎంకు జనసేనాని విజ్ఞప్తి

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించేందుకు ఒప్పుకున్నారు.ప్రభుత్వం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాంటూ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాస్త పట్టుగా ఉంది.తాము ఇచ్చిన గడువులో కార్మికులు సమ్మెను విరమించి డ్యూటీల్లో చేరలేదు కనుక వారిని తీసుకునే ఉద్దేశ్యం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

దాంతో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటీ అంటూ నిన్నటి నుండి ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆర్టీసీ కార్మికుల పక్షాన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించాడు.కార్మికులను బేషరతుగా ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు పవన్‌ విజ్ఞప్తి చేశాడు.

కార్మికులు మన వాళ్లే అనే ఉద్దేశ్యంతో మీరు వ్యవహరించండి అంటూ కేసీఆర్‌ను పవన్‌ కోరాడు.

అయితే ప్రభుత్వం మాత్రం కార్మికుల నుండి ఒక బాండ్‌ తీసుకుని దాంట్లో మళ్లీ సమ్మెకు వెళ్లమంటూ హామీ తీసుకోవాలని భావిస్తుందట.

అందుకు గాను కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.మరి ఆ షరతుకు ఆర్టీసీ కార్మికులు ఒప్పుకుంటారా అనేది చూడాలి.

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన