వంద రోజులు వంద నిందలు ! సమరమే అంటున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాడు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేకపోవడం, అధికార పార్టీ వైసీపీ మీద ప్రజల నమ్మకం పోయిందన్న అభిప్రాయంలో పవన్ ఉన్నారు.

అదీ కాకుండా ప్రభుత్వ వంద రోజుల పాలనపై స్పందించి రాజకీయ వేడి పెంచాలని పవన్ చూస్తున్నాడు.

తాజాగా వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనపై అధ్యయనం చేసేందుకు పార్టీ నేతలు, నిపుణులతో కొద్దిరోజుల క్రితం కమిటీని నియమించారు పవన్.

తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్‌కు నివేదిక అందింది.ఈ నివేదికను ఈ నెల 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ ఈ నివేదికను విడుదల చేయనున్నారు.వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో వందరోజుల వరకు వేచి చూద్దామని ఇప్పటివరకు పెద్దగా విమర్శలు చేయలేదు ఇప్పుడు అది కాస్తా పూర్తవడంతో ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు.

"""/"/  రాజధాని అమరావతి, ఇసుక విధానం, అభివృద్ధి పనుల నిలిపివేత, పోలవరం వంటి మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించి పవన్ తన అభిప్రాయాలను పధ్నాలుగో తేదీన వివరిస్తారు.

ఈ మేరకు మూడు రోజుల పాటు అమరావతిలోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్టు జనసేన పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.

వంద రోజుల సమయం ఇచ్చినపప్పటికీ ఇసుక రవాణా చేయకుండా ఆంక్షలు విధించడం వల్ల సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఓ సారి లేక రాశారు.

ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కూడా కోరారు.అయితే ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.

అలాగే అమరావతి విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పు బట్టారు.రాజధానిని తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా గొంతు ఎత్తేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు.

"""/"/  ఈ విధంగా చేయడంవల్ల పార్టీ నాయకులు, అభిమానుల్లో ఇప్పటివరకు ఉన్న నిస్తేజం తొలగిపోయి యాక్టివ్ అవుతారని పవన్ భావిస్తున్నాడు.

ఇక నిత్యం ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ వారిలోనే తిరుగుతుండడం వల్ల జనసేన మీద వారికి అభిమానం పెరుగుతుందని అది ఎన్నికల నాటికి మరింత పెరిగి పార్టీకి కలిసొచ్చేలా చేస్తుందని పవన్ భావిస్తున్నాడు.

దీనిలో భాగంగానే ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు,ఇతర అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై మేథోమథన సదస్సులు నిర్వహించేందుకు పవన్ సిద్ధం అవుతున్నాడు.

పిఠాపురంలో పవన్ కు ఓటమి భయం పట్టుకుందా.. అందుకే సెలబ్రిటీలందరిని దింపారా?