పవన్ కీలకపాత్ర పోషిస్తారా ? మంత్రి పదవి అందుకే వద్దనుకుంటున్నారా ?

మరికొద్ది రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది.ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

దీంతో మంత్రివర్గం పైన అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు.ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలి ? ఏ శాఖలు కేటాయించాలని లోతుగా చర్చిస్తున్నారు.

కొత్త క్యాబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కీలక పదవులు దక్కబోతున్నాయనే హడావుడి జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రిగా( Deputy CM ) అవకాశం దక్కబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

దీంతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నుంచి మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి.

"""/" / మొత్తంగా 25 మంది మంత్రివర్గంలో టిడిపి నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరికీ అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు పవన్ మాత్రం మంత్రి పదవి తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదట.

మంత్రిగా కంటే జనసేన పార్టీ( Janasena ) అధినేత గానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ, ,ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలతో పవన్ ఉన్నట్లు సమాచారం.

దీనిపైన త్వరలోనే పవన్ నిర్ణయం ఏంటి అనేది అధికారికంగా ప్రారంభించింది. """/" / టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మంత్రి పదవి తీసుకునే విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదట.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట.

గతం లో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ క్యాడర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉండడంతో, ఇప్పుడు పార్టీ పైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారట.

జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ , కొణతాల రామకృష్ణ , బొలిశెట్టి సత్యనారాయణకు క్యాబినెట్ లో అవకాశం ఉండబోతోందట బీసీ వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందట.

టిడిపి నుంచి నిమ్మకాయల చినరాజప్ప లేదా నిమ్మల రామానాయుడు కు కాపు కోటా లో డిప్యూటీ సీఎం గా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

టీడీపీ కి గవర్నర్ పదవి ..  ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?