నెల్లూరుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్! 2019 ఎన్నికలలో సత్తా చాటుదాం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో ఇప్పటికే చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాలలో పర్యటించారు.

ఇక అతని పర్యటనకి రాయలసీమలో కూడా భారీ ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభించడం విశేషం.

ఇక రాయలసీమలో ఎంపిక చేసుకున్న ప్రకారం పర్యటన సాగిస్తున్న పవన్ తన బలం చాటుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని చెప్పాలి.

ఓ వైపు రోడ్ షో, మరో వైపు బహిరంగ సభలు, అలాగే విద్యార్ధులు, సేవా సంస్థల ప్రతినిధులు, జనసేన క్యాడర్ తో చర్చలు నిర్వహిస్తూ పవన్ తన పర్యటనని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ రోజు నెల్లూరు జిల్లాలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను చిన్న వయసులో నెల్లూరులో ఉండేవాడిని, అని రాష్ట్రంలో ఎక్కడైనా జనసేన అధినేత అనిపిస్తుంది కాని నెల్లూరు వస్తే ఇక్కడ తిరిగిన పవన్ కళ్యాణ్ మాత్రమె ఉంటాడని చెప్పుకొచ్చాడు.

2009 లో పోటీ చేసి వుంటే నెల్లూరు నుంచే బరిలో దిగాలని అనుకున్నా అని చెప్పిన పవన్, ఏపీలో ప్రజల అణచివేత, కొంత మంది చేతిలోనే ఉండిపోయిన రాజకీయం చూసి కోపంతో రాజకీయాలలోకి వచ్చా అని చెప్పారు.

2019లో ఏపీలో జనసేన కచ్చితంగా సత్తా చూపిస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.