సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టిన జనసేనాని!

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా తాజా ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు.

అయితే ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ఏకంగా 20 లక్షల వరకు ఓట్లను తెచ్చుకొని పరవాలేదనిపించుకున్నాడు.

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తో మార్పు సాధ్యం అవుతుందని ఆంధ్ర ప్రజలు 20 లక్షల మంది వరకు నమ్మడం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

గత కొద్దిరోజులుగా అమరావతిలో పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జనసేనాని వారి నుంచి ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ ఓటమితో ఎవరు కృంగి పోవాల్సిన అవసరం లేదని జనసేనాని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.తాజా ఎన్నికల్లో జనసేన ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ స్థాయిలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడమే అని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించి ఈ ఐదేళ్లు పార్టీని గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ తో సంస్థాగతంగా గట్టి పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.

దీనికి ముందుగా రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్యాడర్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా అంతర్మధనం పడింది.

భవిష్యత్తులో పార్టీని నడిపించే నాయకత్వం లేకపోతే ఇప్పుడు ఆ పార్టీ నేతలను కూడా కలవరపెడుతుంది.

ఈ నేపథ్యంలో ఏపీలో లో వై.సీ.

పి తర్వాత ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ కనిపించడం.పవన్ కళ్యాణ్ కూడా ఈ ఐదేళ్లు పూర్తిగా ప్రజల్లో నుండి బలమైన పునాదులు వేసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది.

దీంతో ఇప్పటికే పక్కచూపులు చూస్తున్న తెలుగుదేశం నేతలు కి భవిష్యత్తులో జనసేన పార్టీ ఒక అవకాశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!