TDP: ఆ 30 సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీదే.. పొరపాట్లు జరిగితే భారీ మూల్యం తప్పదా?

టీడీపీ, జనసేన, బీజేపీ ( TDP, Janasena, BJP )పొత్తు ఫిక్స్ కావడంతో ఏపీలో పొలిటికల్ లెక్కలు శరవేగంగా మారిపోతున్నాయి.

జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో ఏపీలో పోటీ చేయనుందని తెలుస్తోంది.

అయితే జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా టీడీపీపైనే ఉంది.

ఏపీలోని చాలా నియోజకవర్గాలలో జనసేన, బీజేపీల కోసం పని చేసే కార్యకర్తలు లేరు.

బూత్ లెవెల్ నుంచి పార్టీని గెలిపించుకోవడానికి కష్టపడే కార్యకర్తలు సైతం పార్టీకి లేకపోవడం గమనార్హం.

ఈ నియోజకవర్గాలలో టీడీపీని నమ్ముకుని టికెట్లు ఆశిస్తున్న నేతలు బీజేపీ, జనసేనలకు సపోర్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకదు.

మరోవైపు వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు 50కు పైగా ఉన్నాయి.టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే గెలుపు అని వైసీపీలో కాన్ఫిడెన్స్ ఉంది.

"""/" / జనసేన, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో సరైన ప్రచారం లేక ఆ పార్టీలు ఓడిపోయినా మూల్యం చెల్లించుకునే పార్టీ మాత్రం టీడీపీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జన బలాన్ని నమ్ముకోకుండా పొత్తు బలాన్ని నమ్ముకోవడం టీడీపీకి మైనస్ అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని రెండో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా టీడీపీ జనసేన బీజేపీ కాలయాపన చేస్తే ఆ పార్టీలకే నష్టమని చెప్పవచ్చు.

"""/" / 2024 ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

వార్ వన్ సైడ్ అవుతుందని కొన్ని నియోజకవర్గాల్లో అంచనాలకు అందని ఫలితాలు రాబోతున్నాయని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ చాలా ముఖ్యమని పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఏ పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ పార్టీదే విజయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలు సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!