అభ్యర్థుల వడబోతకు జనసేన స్క్రీనింగ్ కమిటీ !

ఏపీలో ఎన్నికల హడావుడి స్టార్ట్ అవుతుండడంతో.జనసేన కూడా ఆ మేరకు స్పీడ్ పెంచి ముందడుగులు వేస్తోంది.

ఇప్పటికే టీడీపీ, వైసీపీ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చెసి ఫైనల్ లిస్ట్ రెడీ చేసేపనిలో ఉండగా.

కాస్త ఆలస్యంగా మేల్కొన్న జనసేన ఇప్పుడు ఆ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది.దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు పవన్.

పార్టీ సీనియర్ నేతలు మాదాసు గంగాధరం, మీడియా కో ఆర్డినేటర్ హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శివశంకర్, హరహం ఖాన్ లను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ వీరు చేయాల్సిన పని ఏంటి అంటే.ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.

ఫైనల్ రిపోర్ట్ ను జనరల్ బాడీకి సమర్పించాలి.ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని కూడా పవన్ ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడ పార్టీ కార్యాలయం కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన బాధ్యత స్క్రీనింగ్ కమిటీదేనని పవన్ క్లారిటీ ఇచ్చారు.

ఈ ఇద్దరు గేమ్ చెంజర్స్ లో ఇంత మార్పు ఎలా వచ్చింది ?