పొత్తుల పద్మవ్యూహంలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల పొత్తుల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నారా ? ఈ సారి కూడా ఒంటరి కాకుండా కలిసివచ్చే పార్టీలతో ఎన్నికల్లో అడుగులు వేయబోతున్నారా ? తాజా పరిణామాలను చూస్తుంటే పొత్తులు విషయంలో ఏపీలో ఏ పార్టీకి లేని ఒత్తిడిలో జనసేనాని సతమతమవుతున్నట్లే కనిపిస్తోంది .

తాజాగా ప్రధాని నరేంద్రమోదీతో సుమారు ఎనిమిది సంవత్సరాల అనంతరం ప్రత్యేకంగా పవన్ భేటీ అయిన సందర్భంలో మరోసారి జనసేన , బీజేపీ పార్టీల ఎన్నికల పొత్తుపై సరికొత్త అంచనాలు ఏపీలో నెలకొన్నాయి .

2014 ఎన్నికల్లో టీడీపీకి స్నేహహస్తం అందించిన జనసేన ఆ తర్వాత 2019లో ఆ పార్టీని దూరం పెట్టింది .

ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు టీడీపీ , జనసేన మళ్లీ స్నేహంహస్తం చాటుకుంటున్న విషయం బహిరంగ రహస్యం .

వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తిరిగి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం విస్తృతంగా ఉంది .

అదే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ల చీలకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

తాజాగా మోదీతో పవన్ కళ్యాణ్ జరిపిన అంతర్గత భేటీతో జనసేన - టీడీపీ కూటమికి కొన్ని అవాంతరాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో ఎన్నికల పొత్తుకు 2019 ఎన్నికల తర్వాత టీడీపీ, బీజేపీ బలంగా మొగ్గు చూపుతూవస్తున్న విషయం విదితమే.

ఇద్దరు పెళ్లాల ముద్దులు పోలీసులా జనసేన పరిస్థితి ఉంది.పొత్తుల విషయంలో అపరిపక్వత కారణంగా పవన్ కళ్యాణ్ రెండు, మూడు సందర్భాల్లో తొందరపడటం అటు పార్టీ కేడర్ తో పాటు , రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా పవన్ వ్యాఖ్యలు మారిన సందర్భాలున్నాయి.

బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసమని ఒకసారి , ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనంటూ టీడీపీతో చెట్టపట్టాలేసుకోవడంతో సరైన సమయంలో సరైన విధానం అవలంభించకపోవడం, తొందరపడటంతో సరైన ఫలితాలు రాబట్టుకోలేకపోతున్నారు .

అత్యంత జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజీ తీసుకోవడంలోనూ, దానిని ఓటు రూపంలో మార్చుకోవడంలో తడబాటు ప్రదర్శిస్తున్నారు.

బీజేపీ నుండి రోడ్ మ్యాప్ అందకపోవడంతో టీడీపీ పవన్ ను తమవైపు తిప్పుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించడంతో వచ్చే ఎన్నికల్లో జనసేన - టీడీపీ పొత్తు ఖాయమనే ప్రచారం జనంలోకి విస్తృతంగా వెళ్లింది .

"""/"/ ఈ పరిణామాలతోనే వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి కూడా తమ సర్వేల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే తమ పార్టీ గెలుపొటముల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశంపై పక్క సర్వేతో ఎన్నికలకు సిద్దమవుతున్నారు .

టీడీపీ , జనసేన పొత్తులపై నిశితంగా గమనిస్తున్న బీజేపీ .పవన్ కళ్యాణ్ మా వైపే అంటు మైండ్ గేమ్ ఆడుతూ టీడీపీ వైపు వెళ్ళకుండా ఎన్నికల కోసం వ్యూహాలు రూపొందిస్తోంది.

టీడీపీతో కలిసి ప్రయాణం చేయడంతో ఓట్లు చీలకుండా ఉంటాయని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీతో భేటీలో టీడీపీతో దూరంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా బీజేపీ పై ఓరేంజ్ లో విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఎపిసోడ్ ను మోదీ , అంతకుముందు తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి సంఘటనలను మోదీషా ద్వయం ఇంకా మర్చిపోయినట్లు కనబడటం లేదు .

బీజేపీలోని రాష్ట్ర నాయకత్వంలోని ఓ వర్గం జనసేన , టీడీపీ తాము కలిసిపోటీచేయాలని భావిస్తున్నప్పటికి మోదీతో సహ ఆ పార్టీ కేంద్ర నాయకత్వం దీనికి చంద్రబాబుతో గత గాయల నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీకి అంగీకరించడం లేదన్నది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ .

దానిలో భాగంగానే పవన్ తో దోస్తీకి సై అంటున్న కమలం పార్టీ సైకిల్ తో జనసేన సవారిని అడ్డుకుంటూ తమతో పాటు కలిసిప్రయాణం చేసేలా పవన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది దీనికి తొలి అడుగుగా ప్రధాని మోదీ జనసేనానికి పొత్తులపై కొత్త సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

15 ఏళ్ల న్యాయపోరాటంలో గూగుల్‌కు ఊహించని షాక్.. యూకే కపుల్‌కు భారీ పరిహారం..