గ్రేటర్ లో బీజేపీకి ఆ ‘పవర్’ ? ‘స్టార్ ‘ తిరిగేనా ?

ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలపైన పెద్దగా ఫోకస్ పెట్టని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మాత్తుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని యాక్టివ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు అకస్మాత్తుగా గ్రేటర్ పరిధిలో సుమారు యాభై డివిజన్లలో పార్టీ కమిటీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అన్ని పార్టీలు కలవరానికి గురయ్యాయి.ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి.

గ్రేటర్ హైదరాబాద్ లో వందకు పైగా డివిజన్లలో గెలిచి తీరాలి అనేది అధికార పార్టీ పెట్టుకున్న టార్గెట్.

ఈ మేరకు టిఆర్ఎస్ మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన శక్తికి మించి కష్టపడుతున్నారు.

గ్రేటర్ లో గ్రేట్ అనిపించుకోవాలని, ఆ తర్వాత సీఎం కుర్చీలో కూర్చోవాలనేది ఆయన ప్లాన్.

అయితే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు చూస్తున్న బీజేపీ గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా, 2023 ఎన్నికల్లోనూ సులభంగా విజయం సాధించవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు.

ఇప్పటికే ఏపీలో పొత్తు పెట్టుకున్న జనసేన ద్వారా ఇక్కడ పైచేయి సాధించాలనే అభిప్రాయంతో చాలా కాలంగా ఆ పార్టీ నాయకులు ఉంటూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగా పవన్ గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించడం వెనుక బీజేపీ అగ్రనేతల హస్తం ఉన్నట్లుగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనుమానిస్తోంది.

బిజెపికి జనసేన మద్దతు ఇవ్వడం ద్వారా, సులువుగా అధికార పార్టీపై పైచేయి సాధించవచ్చు అనేది బిజెపి ప్లాన్.

"""/"/ ఎందుకంటే గ్రేటర్ పరిధిలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.

వారందరూ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారుతారని, తెలంగాణలో మరింతగా బలపడే అవకాశం ఉంటుందని బిజెపి భావిస్తోంది.

అవసరమైతే ఇక్కడ జనసేన కు సైతం కొన్ని డివిజన్లను కేటాయించేందుకు బిజెపి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతుండడం, ఆ పార్టీని ఆక్టివ్ చేయడం వంటి పరిణామాలను టిఆర్ఎస్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలిపెడితే, తమకే తీరని నష్టం జరుగుతుందని గ్రహించింది.పవన్ ద్వారా యూత్ ఓట్లను కొల్లగొట్టడంతో పాటు, సెటిలర్ల ఓటర్లను తమ ఖాతాలో వేసుకోవాలి అనేది బిజెపి ప్లాన్ గా కనిపిస్తోంది.

పవన్ తీసుకున్న నిర్ణయంతో బిజెపి తెలంగాణ నేతల ఆనందానికి అవధులే లేవు.

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!