సంచలన నిర్ణయం తీసుకున్న జానారెడ్డి.. వచ్చే ఎన్నికలే టార్గెట్..!

మాజీ మంత్రి జానారెడ్డి గురించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పరిచయం అక్కరలేదనుకుంట.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం.తన కెరీర్‌లో ఎన్నో పదవులు అధిరోహించారు.

మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌లతో కలిసి పనిచేశారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయన సొంతం.

2019 ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోయారు.ఆ తర్వాత మొన్న టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో మరోసారి నాగార్జున సాగర్‌కు ఉప ఎన్నిక జరిగింది.

ఈ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయగా నోముల భగత్ చేతిలో ఓడిపోయారు.అందుకు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలే కారణంగా తెలుస్తోంది.

అయితే, జానారెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారుగా వ్యవహరించాలని చూస్తున్నట్టు తెలిసింది.

కాకపోతే ఆయన కుమారులు ఇద్దరిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారట.

నాగార్జున సాగర్‌లో ఇప్పటికీ జానారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది.గతంలో రాహుల్ గాంధీ ఒక ఫ్యామిలీకి ఒకే టిక్కెట్ అని చెప్పడంతో వారి కుమారుల పోటీకి మార్గం సుగమం కాలేదు.

"""/"/ ఇక జానా పెద్దకుమారుడు రఘువీర్ 2018 ముందస్తు ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావించారు.

కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు.అయితే, రాబోయే ఎన్నికల్లో తన ఇద్దరు కుమారులకు టిక్కెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారట జానారెడ్డి.

ఒకరు మిర్యాల గూడ, మరొకరు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని తెలిసింది.

అందుకే టీపీసీసీ చీఫ్‌తో జానా మంచి రాపో మెయింటెన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రి రేవంత్ జానారెడ్డి ప్లాన్‌కు ఎలా స‌పోర్టు చేస్తార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రి ఒకే సామాజిక వ‌ర్గం నేత, పైగా జానారెడ్డి ఏనాడూ రేవంత్ ను విమ‌ర్శించింది కూడా లేదు కాబ‌ట్టి ఆ సంబంధాలు క‌లిసి వ‌స్తాయ‌ని భావిస్తున్నారంట‌.

త్రివిక్రమ్ స్వయం వరం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?