ఇదేందయ్యా ఇది.. పెళ్లి కాకుండానే తల్లైన బుల్లితెర నటి.. వీడియో వైరల్?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవడంతో అభిమానులకు అలాగే సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.

దీంతో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండితెర సెలబ్రిటీలు సైతం సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వాళ్లకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు.

అయితే యూట్యూబ్ కి సెలబ్రిటీలు సామాన్యులు అనే రూల్స్ లేకపోవడంతో చాలామంది సెలబ్రిటీలు యూట్యూబ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు.

మరీ ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలు అయితే హోమ్ టూర్, ఫంక్షన్స్, మ్యారేజ్, షూటింగ్ సెట్లు కామెడీ సన్నివేశాలు ఇలా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా ఫ్రాంక్స్ అని చెప్పి ఫ్రాంక్ వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీలలో ఎక్కువగా యాంకర్ లాస్య, శివ జ్యోతి, నటి శ్రావణి ఇంకా ఎంతో మంది నటీమణులు యూట్యూబ్లో ఎప్పటికప్పుడు షాపింగ్ లు హోమ్ టూర్లు ఫంక్షన్స్ మేకప్ ఇలా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యే వీడియోలలో జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ యూట్యూబ్ వీడియోస్ కూడా బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.

ప్రియాంక షేర్ చేస్తున్న ఒక వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రియాంక కి పెళ్లి కాలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కానీ ఆమె తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో సీమంతం సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు.

"""/"/ అదేంటి పెళ్లి కాకుండానే సీమంతం ఏంటి అని చాలామంది ఆ వీడియో ఓపెన్ చేసి చూడగా ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.

అయితే అదంతా కూడా జానకి కలగనలేదు సీరియల్ సీక్వెన్స్ లో భాగంగా తనని ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు కనిపించాలని చెప్పారట.

దాంతో వీడియోని తన శ్రీమంతం అంటూ పోస్ట్ చేసి ఒక బ్లాంకెట్ బయటికి తీసి ఉత్తుత్తే అని షాక్ ఇచ్చింది జానకి.

అయితే కొందరు ఈ వీడియో పై ఫన్నీగా స్పందిస్తుండగా మరికొందరు మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అవసరమా అని ఫైర్ అవుతున్నారు.

పెళ్లి కూడా కాలేదు అప్పుడే నీకు సీమంతం ఆలోచనలు వస్తున్నాయా అంటూ కొందరు ప్రియాంక జైన్ పై మండిపడుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకటి కాదు రెండు కాదు..హీరో దర్శన్ చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకు ?