2024 ఎన్నికలలో బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తరించాలని ఆశపడుతున్న జనసేన అధినేత చాలా లౌక్యంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా కనిపిస్తుంది తెలుగుదేశంతో పొత్తులు( TDP ) ఉంటాయని చాలా కాలం క్రితమే ప్రకటించడం ద్వారా తెలుగుదేశం అనుకూల వర్గాల మద్దతు సాధించిన ఆయన ఆయా వర్గాల మీడియా మద్దతును సంపాదించుకోవడం మొదటి విజయం గా చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు జనసేన తాలూకు అత్యంత పెద్ద సభలు కూడా కనీసం పట్టించుకోని మీడియా వర్గాలు ఇప్పుడు పవన్ ప్రతి విషయాన్ని విపరీతంగా కవర్ చేస్తూ అవి ప్రజల్లోకి వెళ్ళేలా తమ వంతు సాయం చేస్తున్నాయి.
వ్యక్తుల, పార్టీల స్వార్థ ప్రయోజనాలను ,వాటి ఆశలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఆయన ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.
ఒకవైపు పొత్తులు ఉంటాయని ఆశ కల్పిస్తూనే మరోవైపు తమ పార్టీని చక్కబెట్టుకుంటూ కీలక నాయకులను ప్రజాక్షేత్రంలో తిప్పుతూ ఆయా నియోజకవర్గాల్లో బలపడే స్కెచ్ జనసేన వేసినట్లుగా తెలుస్తుంది .
ఉత్తరాంధ్రలోకాని ఉభయగోదావరి జిల్లాలో కానీ గుంటూరు కృష్ణ వట్టి జిల్లాలలో తమకు కలిసి వచ్చే నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించి పెట్టుకున్న జనసేన నియోజకవర్గం అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టాలని చూస్తుందట .
"""/" / గత ఎన్నికలలో రాజకీయాలలో విప్లవాత్మమైన మార్పులు తీసుకురావాలని ఆశించిన జనసేన జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను అమలు చేసి ఘోరంగా దెబ్బతింది .
ముఖ్యంగా ఎన్నికలకు ధనం ముడిసరికి అయిపోయి చాలా కాలం అయిపోయిన ప్రస్తుత తరుణం లో ప్రజలు కూడా ఎన్నికల సమయంలో పార్టీల నుంచి తాయిలాలు ఆశించడం సర్వసాధారణ విషయం అయిపోయింది.
అలాంటప్పుడు ఎలాంటి ప్రయోజనం లేకుండా గంటల తరబడి క్యూలో నిలబడి ఓట్లు వేయడానికి ప్రజలు కూడా ఇష్టపడటం లేని వాతావరణం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది .
అలాంటప్పుడు విస్తృత ప్రయోజనాల కోసం అయినా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వక తప్పదని గ్రహించిన జనసేన అధ్యక్షుడు( Jana Sena ) ఈసారి దన బలం ఉన్న అభ్యర్థులను కూడా ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది .
దాంతో మిగతా రెండు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వచ్చని జనసేన భావిస్తుంది
.
విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం షాక్.. దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ-మెయిల్స్