జన’ సేన ‘ బలం పెరుగుతోందిగా..?

గతంతో పోల్చి చూస్తే ఇటీవల కాలంలో జనసేన పార్టీ గ్రాఫ్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తోంది .

వైసీపీలోని అసంతృప్తి నాయకులతో పాటు, తటస్తులు జనసేన వైపే చూస్తున్నారు.ఇటీవల కాలంలో ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరగడం, టిడిపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కచ్చితంగా రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాలతో చాలామంది జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

మొన్నటి వరకు చిన్నాచితక నేతలతో హడావుడి కనిపించినా, ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్న వారిలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడం, అలాగే బలమైన సామాజిక వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు జనసేన లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు జనసేన లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి.

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక చేపట్టడం, చాలామంది జగన్ సన్నిహితులతో పాటు కీలక నేతలకు టికెట్ ఇవ్వకపోవడం, తదితర పరిణామాలతో అసంతృప్తి గురైన వారంతా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

"""/" / ఇప్పటికే కొంతమంది జనసేన లో చేరిపోగా, మరి కొంత మంది టికెట్ హామీ లభిస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

జనసేన లో చేరేందుకు ఇద్దరు మాజీ మంత్రులతో పాటు, ఓ సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నారని, పవన్ నుంచి అనుమతి రాగానే వారి చేరిక ఖాయం అనే ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ నెల 27న మాజీమంత్రి ,విశాఖ జిల్లా కీలక నేత కొణతాల రామకృష్ణ ( Konathala Rama Krishn )జనసేన పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

విశాఖ జిల్లా రాజకీయాల్లో కొణతాల రామకృష్ణ కీలక నేతగా ఉన్నారు.గతంలో మంత్రిగానూ వ్యవహరించారు.

రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ వెంట నడిచారు.అక్కడ జగన్ తో విభేదాలు ఏర్పడడం తదితర కారణాలతో చాలాకాలంగా రాజకీయంగా సైలెంట్ అయ్యారు.

అయితే ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. """/" / ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) కొణతాల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా కోరినా, కొణతాల ఆయన అనుచరులు మాత్రం జనసేన వైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఇక కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం జాసేన లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

అలాగే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనే విషయాన్ని జగన్ చెప్పడంతో.

ఆయన కూడా జనసేన పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఇక గూడూరు వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం జనసేన లో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ ను జగన్ తప్పించి ఆ స్థానంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ రావు ను ఇన్చార్జి గా నియమించడంతో, అసంతృప్తికి గురైన వరప్రసాద్ జనసేన చేరాలని నిర్ణయించుకున్నారట.

వీరే కాకుండా మరికొంతమంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు జనసేనలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.

   .

ఎన్ఆర్ఐ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు.. ఉలిక్కిపడ్డ పంజాబ్