మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ ! అక్కడే ఎందుకంటే ? 

ఏపీ రాజకీయాల్లో మరింత స్పీడ్ పెంచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.

ఒకపక్క సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్న పవన్,  వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేసుకుని పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసిపి , టిడిపిలకు ధీటుగా జనసేన ను బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకపక్క టిడిపి జనసేన పొత్తు వ్యవహారమూ ప్రస్తుతం చర్చల్లోనే ఉంది.దీనిపై త్వరలోనే ఒక క్లారిటీకి రాబోతున్నారు.

ఇదేలా ఉంటే.మార్చి 14వ తేదీన జనసేన 10 వ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నం వేదికగా నిర్వహించబోతున్నట్లు జనసేన ప్రకటించింది .

"""/" / ఈ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మంగళగిరి నుంచి తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా మచిలీపట్నానికి ఆరోజు పవన్ చేరుకోనున్నారు.

ఈ విషయాలను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అయితే మచిలీపట్నంలోనే జనసేన పదో ఆవిర్భావ సభను నిర్వహించడం వెనుక ప్రత్యేకత ఏమీ లేకపోయినా , తమను చాలా కాలంగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే పేర్ని నానిని టార్గెట్ చేసుకునే ఆ సభను.

  ఆ నియోజకవర్గంలో పెడుతున్నట్లుగా తెలుస్తోంది.చాలా కాలంగా పవన్ ఏపీలో ఏ సభ నిర్వహించినా,  ఏ వ్యాఖ్యలు చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి పేర్ని నాని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు.

పవన్ సామాజిక వర్గానికి చెందిన నాని వ్యక్తిగతంగానూ, రాజకీయంగాను పవన్ పై విమర్శలు చేస్తూ చాలాకాలంగా ఇబ్బందికరంగా మారడంతో ఇప్పుడు ఆయనను టార్గెట్ చేసుకునే రాబోయే ఎన్నికల్లో పేర్ని నానిని ఓడించేందుకు పవన్ లక్ష్యం పెట్టుకున్నారని,  అందుకే మచిలీపట్నంలో సభను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

"""/" / ఈ మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ పేర్ని నానిని ఏ విధంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మచిలీపట్నం సభను భారీగా నిర్వహించి సక్సెస్ చేయడంతో పాటు,  రాజకీయంగా అనేక కీలక ప్రకటనలు పవన్ చేసే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

‘ అల్లు ‘ కోసం దిల్ రాజు .. ఎంట్రీ  వెనుక కారణం ఇదా ?