వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్న జనసేన

ఏ రాజకీయ పార్టీ దీర్ఘకాల మనుగుడ కైనా ఆ పార్టీని గుడ్డిగా నమ్మి బలపరిచే నాయకుల మద్దతు అత్యవసరం.

కార్యకర్తలు, మద్దతుదారులు ఓటర్లు పరిస్థితుల బట్టి, పార్టీ నిర్ణయాలు బట్టి మారుతూ ఉన్నప్పటికీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా బలంగా నమ్ముతూ ముందుకు తీసుకెళ్లే హార్డ్ కోర్ నాయకులు ఏ పార్టీకైనా ఆక్సిజన్ లాంటివారు.

అలాంటి వారిని పోగొట్టుకోవడం రాజకీయంగా పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం మంచిది కాదు.కానీ జనసేన( Jana Sena ) అధినాయకత్వం తక్షణ అవసరాల కోసం దీర్ఘకాలం నిలబడే నాయకులను పోగొట్టుకుంటుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న విశ్లేషణల సారాంశం.

నిన్న మొన్నటి వరకు పార్టీకి బలంగా తన వాయిస్ వినిపించిన జనసేన మాజీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ( Kalyan Dileep Sunkara )పార్టీ తన పట్ల చూపిస్తున్న ఉదాసీన వైఖరితో విసుకు చెంది తాను పార్టీకి దూరంగా ఉండబోతున్నానని ప్రకటించారు.

"""/" / ఇది ఒక రకంగా పార్టీకి బలంగా అండగా నిలబడుతున్న యువతకు నిరుత్సాహం కలిగించే వార్త.

పార్టీ స్టాండ్ ను బలంగా వినిపిస్తున్న యువతకు కళ్యాణ దిలీప్ సుంకర ( Kalyan Dileep Sunkara ) అందిస్తున్న కంటెంట్ చాలా ఉపయోగపడేది.

ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోవడంతో ఒక బలమైన గొంతు మిస్సయినట్టు అయింది.ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పార్టీ స్టాండ్ ను బలంగా వినిపిస్తున్న కేతం రెడ్డి రెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది.

ముఖ్యంగా భవిష్యత్ ముఖ్యమంత్రి పవన్ ( Pawan Kalyan )పేరుతో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కేతం రెడ్డి చేసిన కృషి విశేషమైనది.

“పవన్ అన్న ప్రజా బాట” పేరుతో నియోజకవర్గంలో ప్రతిరోజు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్న వినోద్ రెడ్డి ఇప్పుడు పార్టీ వ్యవహార శైలికి విసుగుచేంది పార్టీకి దూరమయ్యారు.

అక్కడ మంత్రి నారాయణ దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వినోద్ రెడ్డి ఇప్పుడు పొత్తులో భాగంగా నారాయణకే సీటు కేటాయిస్తామని పార్టీ పెద్దలు చెప్పడం పైగా రాజకీయంగా తనకు సరైన మార్గం చూపిస్తామన్న హామీ కూడా ఇవ్వకపోవడం పార్టీ కోసం తాను పడుతున్న కష్టానికి గుర్తింపు ఇవ్వడం లేనట్లుగా పార్టీ వ్యవహరించడంతో ఆయన మనస్తాపం చెంది పార్టీని వీడారు.

"""/" / నిజానికి పార్టీని వీడిన నేతల పట్ల ఆ పార్టీ కార్యకర్తలు విమర్శిస్తూ వాఖ్యలు చేస్తారు , కానీ కేతం రెడ్డి( Kethamreddy ) లాంటి నేతను పోగొట్టుకోవడం జనసేన కార్యకర్తలు ఎంత బాధగా ఉన్నారో వారి సోషల్ మీడియా పోస్టులను చూస్తే అర్థమవుతుంది.

పార్టీ ఎందుకు ఇలాంటి నిజాయితీ కలిగిన నేతలను పోగొట్టుకుంటుందో అర్థం కాక పార్టీ అభిమానుల్లో ఒక అయోమయం వాతావరణం నెలకొంది.

జనసేన అధిష్టానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.మరి వ్యూహాత్మకం గా ఇన్ని తప్పటడుగులు వేయడం పార్టీ ఎదుగుదలకు ఏ మాత్రం మంచిది కాదు అని మాత్రం కచ్చితం గా చెప్పవచ్చు .

ఎవరీ నిహారిక ఎన్ఎమ్.. గీతా ఆర్ట్స్ సినిమాలోని ఆఫర్ పొందడం ఆమె అదృష్టమా..??