మహిళా కమిషన్ నోటీసులివ్వడంపై జనసేన నేతల ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మహిళా చట్టాల అమలు, మహిళల రక్షణను కమిషన్ చూసుకోవాలని ఆ పార్టీ నేత శివశంకర్ తెలిపారు.

కానీ వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రేరేపితంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.పవన్ ను మంత్రులు బూతులు తిట్టినప్పుడు వాసిరెడ్డి పద్మకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

ఎవరో చెబితే నోటీసులు ఇచ్చి కమిషన్ పరువు తీయకండి అంటూ సూచించారు.

రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?