ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అధినేత పర్యటన
TeluguStop.com

రేపు ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.ఏపీలో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.


ఈ యాత్రలో భాగంగా పర్యటన కొనసాగనుంది.పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటం గ్రామంతో రచ్చబండ కార్యక్రమం జరగనుంది.


ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.అనంతరం ఆత్మహత్యలకు పాల్పడ్డ పలువురు రైతుల కుటుంబాలకు రూ.
లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
రాజస్థాన్‌లో దారుణం.. మంచంపై ఒంటెని కట్టేసి మహిళ చిందులు, వీడియో చూస్తే!