జనసేన అభ్యర్థికి సొంత పార్టీ నుండే నిరసన సెగ…!

సూర్యాపేట జిల్లా:కోదాడ జనసేన,బీజేపీ( ) ఉమ్మడి అభ్యర్ధి మేకల సతీష్ రెడ్డి ( Mekala Satheesh Reddy )కి సొంత పార్టీ కార్యకర్తల నుండే నిరసన సెగ తగిలింది.

శుక్రవారం పట్టణంలో పెరిక హాస్టల్ నందు బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదాడ( Kodad )కు చెందిన జన సైనికులు అభ్యర్ధి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకల్ జన సైనికులకు,కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాన్ లోకల్ వ్యక్తులను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నట్లు జనసేన అభిమానులు, కార్యకర్తలు తెలుసుకొని ఆందోళన చేపట్టారు.

కోదాడ పట్టణంలో జనసేన కార్యకర్తలు ప్రతి సంవత్సరం వివిధ రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని,లోకల్ వ్యక్తులను కాకుండా వేరే నియోజకవర్గాల నుండి కార్యకర్తలను తీసుకొని వచ్చి నామినేషన్( Nomination ) కు సిద్ధపడడంపై మండిపడుతూ ఆందోళనకు దిగి,సతీష్ రెడ్డిని ప్రతిఘటించడంతో కొద్దిసేపు రచ్చ కొనసాగింది.

పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?