Jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అవి మద్రాసులో మిస్సమ్మ( Missamma ) సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్న రోజులు.

టైటిల్ రోల్ పోషించడానికి భానుమతిని సెలెక్ట్ చేసారు.ఇక హీరో పాత్ర కోసం ఎన్టీఆర్( NTR ) అనుకున్నారు.

అయితే భానుమతి కి చెల్లెలు గా నటించడానికి సరైన నటి దొరకడం లేదు.

దాంతో విజయ గార్డెన్( Vijaya Garden ) లో ఆడిషన్స్ నిర్వహించగా జనాలు ఎగబడ్డారు.

ఆ రోజు కమెడియన్ రేలంగి విజయ గార్డెన్ కి వచ్చారు.తనతో పాటే నటి జమున ను కూడా వెంటబెట్టుకొని వచ్చారు.

అప్పటికే ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది.ఇదిగో ఈ పిల్లను మీ సినిమా లో మిస్సమ్మ చెల్లి పాత్ర కోసం తీసుకోండి అని చెప్పారు రేలంగి.

"""/" / మిస్సమ్మ సినిమాకు డైరెక్టర్ గా ఎల్ వి ప్రసాద్( LV Prasad ) గారు ఎప్పుడు ఒక మాట చెప్తుండే వారు.

ఎన్ని సినిమాలు చేశామా అని కాదు ఎన్ని మంచి సినిమాలు చేసామో అదే ముఖ్యం అనేవారు.

అందుకే సంఖ్య బలం కన్నా కూడా స్దాన బలం కోసం ఆరాటపడి టాలీవుడ్ లో అప్పటికే అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు.

కావున చిన్నదా, పెద్దదా అని చూడకుండా అన్ని పాత్రలకు ముందే ఆడిషన్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అని చేయించుకునేవారు.

ఈ చిత్రాన్ని తీయడం కోసం అప్పట్లోనే ఎల్ వి ప్రసాద్ దాదాపు మూడేళ్ళ సమయం కూడా తీసుకున్నారంటే ఆయనకు సినిమా మీద ఎంత ఆసక్తి వుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

"""/" / ఇక ఆయనకు రేలంగి అంటే మంచి విలువ కలిగి ఉండేవారు.

జమున( Jamuna ) ను చూడగానే బాగా సన్నగా ఉంది అని అన్నారట.

కావాలంటే ఎలా చేస్తుందో ఒక టెస్ట్ పెట్టి తీసుకోండి అన్నారట.అలాగే ఆడిషన్ అయ్యాక జమునను అతి కష్టం మీద ఒకే చేసారట.

ఇక ఎల్ వి ప్రసాద్ ఒక సందర్భం లో మాట్లాడుతూ నటన అంటే సిగ్గు, బిడియం వంటివి ఉండకూడదు.

ఇండస్ట్రీ కి వచ్చే హీరోయిన్స్ అవన్నీ తీసేసి రావాలి అన్నారట.ఆ మాటలు విన్న జమున ఆ సినిమాలో చేయడానికి బయపడి జంప్ అయ్యారట.

అయితే రేలంగి కి విషయం తెలిసి ఖంగు తిన్నారట.ఎల్ వి ప్రసాద్ ని అతి కష్టం మీద ఒప్పిస్తే ఈ పిల్ల ఏంటి ఇలా చేసింది అని జమున ఏదోలా ఒప్పించి ఆ సినిమాలో నటించేలా చేసాడు రేలంగి.

ఆ తర్వాత ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందో అందరికి తెలిసిందే.

రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?