ఏపీలో జమిలి హీట్.. ఎవరెటువైపు ?

కేంద్రం జమిలి ఎలక్షన్స్( Jamili Elections ) వైపు అడుగులు వేస్తోందని సంగతి దేశ వ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అవుతోందో అందరికీ తెలిసిందే.

ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్( Ramnath Kovind ) అధ్యక్షతన జమిలి ఎలక్షన్స్ పై ఓ కమిటీని కూడా వేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇక ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎలక్షన్స్ బిల్ ను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తునట్లు వినికిడి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఏ ఏ పార్టీలు మద్దతు తెలుపుతాయి.

ఏ ఏ పార్టీలు నిరాకరిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. """/" / ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ జమిలి ఎలక్షన్ హీట్ కాక రేపుతోంది.

ఎందుకంటే ఏపీలోని ప్రధాన పార్టీలు ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.యదాతథంగా రాష్ట్ర బీజేపీ( BJP ) కేంద్ర ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తుంటే.

దాని మిత్రపక్షమైన జనసేన( Janasena ) కూడా జమిలి ఎలక్షన్స్ కు సిద్దమే అంటోంది.

కానీ ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ( TDP ) వైసీపీ( YCP ) లు మాత్రం స్పష్టమైన వైఖరిని తేటతెల్లంచేయడం లేదు.

జమిలి ఎలక్షన్స్ ను స్వాగతిస్తామని చెబుతూనే వాటిని ప్రవేశ పెట్టడం వల్ల ఒరిగేదెమి లేదని వైసీపీ చెబుతోంది.

అటు టీడీపీ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. """/" / ఒకవైపు బీజేపీతో దోస్తీ కోసం అరపడుతుండడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కచ్చితంగా స్వాగతించాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది.

అయితే జమిలి ఎలక్షన్స్ వల్ల టీడీపీ ఓటు బ్యాంక్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీలోని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారట.

దీంతో జమిలి ఎలక్షన్స్ పై ఏపీలో ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయాన్ని కలిగి ఉంది.

అయితే ఈ నెల 18 న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడితే టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ఇటు తెలంగాణ జమిలి ఎలక్షన్స్ కు తాము సిద్దమే అని బి‌ఆర్‌ఎస్ చెబుతున్నప్పటికి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ బిల్ కు ఎంతవరు మద్దతిస్తుందనేది ప్రశ్నార్థకమే.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏడాదికో సినిమాతో తారక్ అదిరిపోయే ప్లానింగ్.. ఈ హీరో ప్లానింగ్ అద్భుతం అంటూ?