తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు

తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహిస్తున్నారు.

పలు గ్రామాల్లో ఈ పోటీలను నిర్వహిస్తుండగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరైయ్యారు.ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గం అనుప్పల్లెలో సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి.

యువత ఉత్సాహంగా జల్లికట్టు పోటీల్లో పాల్గొంటున్నారు.పశువుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.కానీ కొన్నిగ్రామాల్లో మాత్రం పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా పోటీలను నిర్వహిస్తున్నారు.

అయితే తాము నిర్వహించేది జల్లికట్టు కాదని, పశువుల పండుగ అని స్థానికులు చెబుతున్నారు.

చాలా ఏళ్లుగా తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!