నల్లగొండ జిల్లా: వేసవి నీటి కష్టాలు గట్టెక్కించేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది.అందుకోసం నాగార్జునసాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలుపెట్టింది.
10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో గత 2 రోజుల క్రితం హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
నాగార్జున సాగర్‌లో నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించినట్లు ఎండి తెలిపారు.
అవసరమైతే, రెండో దశ అత్యవసర పంపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.నీటిలో తేలియాడే సబ్ మెర్సిబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
మే నెల 15 తేదీ నుంచి ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు.అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి జలమండలి సిద్ధంగా ఉందన్నారు.
నీటి వినియోగదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎండీ విజ్ఞప్తి చేశారు.ఇదిలా వుంటే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 507.
50 అడుగులకు చేరింది.నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ఈ ప్రభావం హైదరాబాద్ తాగునీటి మీద పడకుండా ఉండేందుకు ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు.
చివరిసారిగా 2017 లో పంపింగ్ చేశారు.సాగర్ జలాశయంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి,అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని సేకరిస్తున్నారు.
అక్కడ నీటిని శుద్ధి చేసి,వాటిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.ఓఆర్ఆర్ వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి సరఫరా చేస్తోంది.
దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?