అమెరికాలో ఇల్లు కొన్న జక్కన్న… ఇండియాకి గుడ్ బై చెప్పనున్నారా?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈయన ఏం చేసినా ఒక పద్ధతి ప్లానింగ్ ప్రకారం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
సీరియల్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.
ఇలా తన సినీ కెరియర్లో అద్భుతమైన విజయాలను అందుకున్నటువంటి రాజమౌళి తాజాగా త్రిబుల్ ఆర్( RRR ) సినిమాతో సంచలన విజయం సాధించారు.
"""/" /
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ (Oscar )ఒక కలగానే మిగిలిపోతుందని భావించిన వారికి ఆస్కార్ అందించి ఏది అసాధ్యం కాదని నిరూపించారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్నటువంటి రాజమౌళి ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్ లతో కలిసి హాలీవుడ్( Hollywood ) సినిమాలు చేసే రేంజ్ కి కూడా వెళ్లారని చెప్పాలి.
ఈయన చేసినటువంటి త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో గత కొద్దిరోజులుగా ఈయన అమెరికాలోనే ఉంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం లాస్ ఏంజెల్స్( Los Angeles ) లో రాజమౌళి ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
"""/" /
ఇలా అమెరికాలో ఇల్లు కొన్నటువంటి రాజమౌళి ఇకపై హాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడతారని అందుకే ఇల్లు కూడా కొనుగోలు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఆస్కార్ వేడుకల నిమిత్తం గత కొద్దిరోజులుగా అమెరికాలో ఉంటున్నటువంటి రాజమౌళి ఇకపై తాను చేసే సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్ లతో కలిసి సినిమా చేయబోతున్నారు ఇలా అమెరికా వెళ్లిన ప్రతిసారి హోటల్లో ఉండడం కుదరని పక్షంలో ఈయన లాస్ ఏంజెల్స్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇదే ఇంటిలోనే రాజమౌళి ఆస్కార్ గెలిచినందుకు పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!