‘జైలర్’ ఫస్ట్ సింగిల్ తెలుగు వర్షన్ కు డేట్ అండ్ టైం ఫిక్స్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ''జైలర్''.( Jailer Movie ) చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇంతకు ముందు రజనీకాంత్ సినిమాకు రిలీజ్ ముందు ఎలాంటి హైప్ ఉండేదో ఈ జైలర్ సినిమాకు కూడా అలాంటి హైప్ క్రియేట్ అయ్యింది.

దీంతో ఈ సినిమా విషయంలో ఈయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. """/" / ఈయన ప్రస్తుతం ఏడు పదుల వయసు దాటిన కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్న రజినీకాంత్( Rajinikanth ) కు జైలర్ సినిమా హిట్ ఇస్తుంది అనే అనిపిస్తుంది.

ఎన్నో ఏళ్ల ముందు సూపర్ స్టార్ ను చుసిన విధంగానే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.

"""/" / నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilipkumar )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.

'కావాలా' అనే ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు తమన్నా లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఈ సాంగ్ తమిళ్ వర్షన్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ రేపు రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక రోల్స్ లో నటిస్తున్నారు.

ప్రతివారం ఈ విధంగా తల స్నానం చేస్తే మీ జుట్టు రాలమన్న రాలదు.. తెలుసా?