‘జైలర్’ 3 రోజుల కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందో తెలిస్తే..

చాలా కాలంగా హిట్ లేక బాధ పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు 'జైలర్' ( Jailer )సినిమా ఊపిరి పోసింది అనే చెప్పాలి.

ఈయనకు మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇచ్చింది.

రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''జైలర్''.

ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా కుమ్మేసాయి.మొదటి రోజు మాత్రమే కాదు ఈ సినిమా రెండవ రోజు కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్( Box Office ) దగ్గర అరాచకం సృష్టించింది.

రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టి చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ స్టామినా బయట పడేలా చేసింది.

వరల్డ్ వైడ్ గా 122.50 కోట్ల బిజినెస్ చేయగా 123 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది.

"""/" / ఇక ఇప్పుడు మూడవ రోజు శనివారం కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్టు టాక్.

ఈ సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.50 షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది.

అలాగే వరల్డ్ వైడ్ గా 30 కోట్ల షేర్ 56 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది.

ఇలా మూడు రోజుల్లో జైలర్ మూవీ 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తుంది.

"""/" / జైలర్ సినిమాకు సూపర్ స్టార్ రోల్ పెద్ద ప్లస్ అవ్వగా శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ( Shivraj Kumar, Ramyakrishna ) కీలక రోల్స్ పోషించారు.

ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.

ఇవన్నీ కూడా సినిమాను ఎక్కడో నిలబెట్టాయి.చూడాలి వీకెండ్ గడిచే సమయానికి ఈ మూవీ ఎంత రాబడుతుందో.

వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?