థియేటర్లలో బ్లాక్ బస్టర్ ఓటీటీలో అలాంటి కామెంట్లు.. జైలర్, బేబీ ఆ ఫ్యాన్స్ కు నచ్చలేదా?

బేబీ,( Baby Movie ) జైలర్( Jailer Movie ) సినిమాలు థియేటర్లలో అంచనాలను మించి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాలు రిలీజైన సమయంలో ఊహించని స్థాయిలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

కొంతమంది ఈ సినిమాలను క్లాసిక్స్ అని ప్రశంసిస్తే మరి కొందరు ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

అయితే ప్రస్తుతం ఈ సినిమాల అసలు రంగు బయటపడింది.ఓటీటీలలో( OTT ) ఈ సినిమాలను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలు ఓవర్ రేటెడ్ సినిమాలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జైలర్, బేబీ సినిమాలు ఓటీటీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో పూర్తిస్థాయిలో ఫెయిలయ్యాయి.కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కథ, కథనం ఏమున్నాయని అభిప్రాయపడుతున్నారు.

"""/" / హైప్ వల్ల ఈ సినిమాలు సక్సెస్ సాధించి ఉండవచ్చని అంతకు మించి ఇంకేం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలకు సీక్వెల్స్( Sequels ) తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ స్థాయిలో సెకండ్ పార్ట్ మెప్పించడం సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం వల్ల ఎలాంటి లాభం ఉండదని మరి కొందరు చెబుతున్నారు.

"""/" / బేబీ సినిమా, జైలర్ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టించాయి.

రజనీకాంత్( Rajinikanth ) యాక్టింగ్ వల్ల జైలర్ సినిమా సక్సెస్ సాధించగా, హీరోయిన్ రోల్ విషయంలో ఉన్న ట్విస్టుల వల్ల బేబీ సినిమా సక్సెస్ సాధించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది మరిన్ని విజయాలు దక్కాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

రజనీకాంత్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా బేబీ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.

వరదల దాటికి కుప్పకూలిన సినిమా చెట్టు.. 150 ఏళ్ల చరిత్రకు ముగింపు..?