సౌత్ ఇండియాలో కుమ్మేస్తున్న ‘నువ్వు కావాలయ్యా’… ఇంతకు ఎవరు నువ్వు?
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా 'వా నువ్వు కావాలయ్యా.'( Va Nuvvu Kaavalayya Song ) అనే పాట వినిపిస్తుంది.
కోట్లాది మంది ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇతర షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ లో రీ క్రియేట్ చేస్తున్నారు.
కోట్లాది మంది ఈ పాటను వింటూ ఉన్నారు.చూస్తూ ఉన్నారు.
కానీ ఇప్పటి వరకు ఈ పాట ఏ సినిమాలో అన్నది చాలా మందికి తెలియదు.
కేవలం తమన్నా( Tamanna ) మాత్రమే కనిపిస్తు ఉండటంతో ఆమె నటించిన ఏదో పాత సినిమా పాట అయి ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు.
కానీ అసలు విషయం ఏంటి అంటే ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొత్త సినిమా జైలర్ లోని పాట.
జైలర్ లో(
Jailer Movie ) మిల్కీ బ్యూటీ తమన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన విషయం తెల్సిందే.
"""/" /
హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ కి ఇది గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఆమె కెరీర్ కాస్త డల్ గా ఉంది.ఇలాంటి సమయంలో రజినీకాంత్ తో నటించడం గొప్ప అవకాశం.
అందులోని ఇలాంటి వైరల్ పాటల్లో ఆమె కనిపించడం వల్ల మరింతగా లాభం ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ పాట వైరల్ అవుతున్నా కూడా సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వక పోవడం తో రజినీకాంత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
అయ్యో ఇలా జరిగిందేంటి అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రజినీకాంత్ కి ( Rajinikanth ) ఓ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ పడాల్సి ఉంది.
తమన్నా కి కూడా ఈ సినిమా సక్సెస్ పడితేనే మరో రెండు మూడు సంవత్సరాల పాటు హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి.
కనుక మిల్కీ బ్యూటీ తో పాటు రజినీకాంత్ ఈ సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ పాటకు ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కడంతో సినిమాకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు.
కానీ ఈ పాట ఎక్కడిది.ఇంతకు ఈ సినిమా హీరో ఎవరు అంటూ కొందరు చర్చించుకోవడం దారుణం.
ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్.. భారీ స్థాయిలో కలెక్షన్లు ఖాయమా?