గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నామినేషన్స్ లో జై భీమ్..!

సూర్య లీడ్ రోల్ లో జ్ఞానవేల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా 'జై భీమ్'.

డైరెక్ట్ డిజిటల్ రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సినిమా సక్సెస్ అవడమే కాకుండా వివాదాలు ఏర్పడేలా చేసింది.తమిళనాడులో వ‌న్నియార్ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచారంటూ 'జై భీమ్' పై గొడవకు దిగారు.

సూర్యపై కేసు.బెదిరింపు కాల్స్ ఇలా చాలా గొడవ జరిగింది.

ఇదిలాఉంటే సినిమాపై వివాదాలు ఎన్ని వచ్చినా సరే ఓ పక్క రికార్డులు కొల్లగొడుతుంది.

లేటెస్ట్ గా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రెస్టిజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2022 నామినేషన్స్ లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్ కేటగిరిలో 'జై భీమ్' సినిమా స్థానం సంపాదించుకుంది.

ఇప్పటికే ఐఎండిబిలో హాలీవుడ్ సినిమాలను దాటి రికార్డ్ రేటింగ్ తెచ్చుకున్న జై' భీమ్' ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ లో కూడా నామినేట్ అయ్యింది.

తప్పకుండా అక్కడ కూడా ఇది అవార్డ్ అందుకుంటుందని అంటున్నారు.సూర్య నటించడంతో పాటుగా ఈ సినిమాను స్వయంగా నిర్మించారు.

సినిమా తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సూర్య ఈమధ్య కాలంలో తెలుగులో రిలీజ్ చేసిన సినిమాల్లో ఇది ఎక్కువమంది ప్రేక్షకులను అలరించిందని చెప్పొచ్చు.

అకాల యుక్త వయసు రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!