Jahnvi Kapoor : ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న జాన్వీ కపూర్..ఎప్పుడంటే..?

శ్రీదేవి ( Sridevi ) కూతురు జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ బాలీవుడ్ వర్గాల నుండి ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) తో కలిసి దేవర అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కూడా జాన్వీ కపూర్ కి అవకాశం వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ జాన్వీ కపూర్ కి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

కానీ దేవర సినిమాతో ఈ హీరోయిన్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని తెలుస్తోంది.

"""/" / ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ విషయం విన్న ఆమె అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకుంటే సినిమాలకు దూరంగా ఉంటుంది కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు.

ఇక జాన్వీ కపూర్ చదువుకున్నప్పటినుండే తనతో ఎంతో స్నేహంగా మెదులుతున్న శిఖర్ పహారియా ( Shikhar Pahariya ) తో లవ్ లో ఉంది.

అయితే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్టీలు, పబ్బులు అంటూ తిరగడమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు.

ఇక దీ """/" / నికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఇక బోనీ కపూర్ ( Boney Kapoor ) కుటుంబానికి జాన్వీ కపూర్ లవర్ శిఖర్ పహారియా కుటుంబానికి మధ్య ఎంతో మంచి సంబంధం ఉందట.

వీరిద్దరి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవడం కోసం బోనికపూర్ కూడా ఓకే చేశారని తెలుస్తోందిఇటు జాన్వి కపూర్ ( Jahnvi Kapoor ) ఫ్యామిలీ అటు శిఖర్ పహారియా ఫ్యామిలీ ఇద్దరు వీరి పెళ్లికి ఓకే చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేయాలి అని బోనికపూర్ భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరమే జాన్వీ కపూర్ కి శిఖర్ పహారియా కి పెళ్లి చేయాలి అని బోనికపూర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరి ఇదే నిజమైతే జాన్వీ కపూర్ సినిమాల్లో కొనసాగుతుందో లేదో చూడాలి.

ఓరిని దుంపలు తెగ.. టీచర్ కుర్చి కింద బాంబు పెట్టి పేల్చేసిన విద్యార్థులు