టాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాహ్నవి కపూర్..!

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ టాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ప్రముఖ హీరో నందమూరి ఎన్టీఆర్ కు జోడిగా జాహ్నవి కపూర్ కనిపించనున్నారు.ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా అరంగేట్రం చేయనున్నారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.ఇందుకు సంబంధించి జాహ్నవి కపూర్ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేసింది.

గతంలో ఎన్టీఆర్ తో కలిసి సందడి చేసేందుకు జాహ్నవి ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.