బెల్లం వర్సెస్ తేనె.. బరువు తగ్గాలని ట్రై చేస్తున్నవారికి ఏది బెస్ట్..?
TeluguStop.com
ఇటీవల రోజుల్లో చాలా మంది శుద్ధి చేసిన చక్కెరను ఎవైడ్ చేస్తున్నారు.ఆరోగ్యానికి మంచిది కాదనే కారణంతో చక్కెరకు బదులుగా బెల్లం( Jaggery) మరియు తేనెను వాడుతున్నారు.
ఇవి రెండు సహజ స్వీటెనర్స్.పైగా హెల్త్ కు కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే బరువు తగ్గాలని ట్రై చేస్తున్నవారు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అన్నది నిర్ణయించుకోలేకపోతుంటారు.
అందుకే వెయిట్ లాస్ కు బెల్లం మరియు తేనెలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అనేది చెరుకు లేదా తాటి రసం తో తయారు చేయబడిన శుద్ధి చేయని చక్కెర రూపం.
మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు వివిధ యాంటీ ఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.
ఒక టేబుల్ స్పూన్ బెల్లం సుమారు అరవై కేలరీలను కలిగి ఉంటుంది.తేనె విషయానికి వస్తే.
పువ్వుల నుండి తేనెటీగలు తయారు చేసిన మందపాటి ద్రవం.తేనెలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి విటమిన్లు, ఖనిజాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.
"""/" /
శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే ఆరోగ్య పరంగా బెల్లం మరియు తేనె రెండూ చాలా మేలు చేస్తాయి.
ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తాయి.అయితే బెల్లంతో పోలిస్తే తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అంటే తేనెను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి.
ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న తేనె ఆకలి బాధలు మరియు కోరికలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
శరీరానికి శక్తిని అందిస్తుంది.మరియు జీవక్రియ వేగవంతం చేస్తుంది.
"""/" /
పైగా తేనె ( Honey )లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఇక బెల్లం తేనె కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది.
ఇది అతిగా తినడానికి దారి తీస్తుంది.అందువల్ల బరువు తగ్గాలని లక్ష్యంతో ఉన్న వ్యక్తులకు బెల్లం కంటే తేనె కొంచెం మెరుగైన ఎంపికగా మారుతుంది.
బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లా.. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ప్లాన్ చేశారా?