మేం తొడ కొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుంది..: జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్( Congress ) ఎంతో సహకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) అన్నారు.

జేఏసీ కన్వీనర్ గా కోదండరామ్ వ్యవహారించారని తెలిపారు.కోదండరామ్ డైరెక్షన్ లో అందరూ పని చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఉద్యమంలో కోదండరామ్ పెద్దన్నలాగా బీష్ముడి పాత్ర పోషించారని చెప్పారు.కేసీఆర్, హరీశ్ రావు ఎన్నోసార్లు కోదండరామ్ ఇంటికి వెళ్లారని తెలిపారు.

"""/" / కానీ కేసీఆర్( KCR ) సీఎం అయ్యాక కోదండరామ్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్ కోదండరామ్ ని( Kodandaram ) అవమానిస్తే తాము గౌరవిస్తున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసే దమ్ము కేటీఆర్ కు( KTR ) ఉందా అని ఆయన ప్రశ్నించారు.

తాము తొడ కొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కేటీఆర్.

మీ గౌరవం తగ్గించుకోకండంటూ సూచించారు.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!