రేవంత్ దారిలోనే జ‌గ్గారెడ్డి.. కేసీఆర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

జ‌గ్గారెడ్డి మొద‌టి నుంచి రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగానే ఉన్నారు.కానీ ఆయ‌న మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ గూటిని వీడ‌లేద‌నే చెప్పాలి.

అయితే ఇప్పుడు రేవంత్ ఎంపిక స‌మ‌యంలో ఆయ‌న ఎంత‌లా వ్య‌తిరేకించారో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఏకంగా సోనియా గాంధీకి కూడా లేఖ‌లు రాశారు.అయితే ఇప్పుడు ఆయ‌న వ్య‌తిరేకించిన రేవంత్ దారిలోనే వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

కొత్త క‌మిటీలో ఆయ‌న‌కూడా ఉండ‌టంతో ప్ర‌భ‌త్వంపై బాగానే బాణాలు ఎక్కుపెడుతున్నారు.కాగా ఇప్పుడు రేవంత్ ఎలా అయితే ఆరోప‌ణ‌లు చేస్తారో అలాగే జ‌గ్గారెడ్డి కూడా ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే చాలా సార్లు భూ క‌బ్జా కోణంలో ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక వీటిలో చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వం మీద ఎఫెక్ట్ కూడా చూపించాయి.ఇక ఇప్పుడు జ‌గ్గారెడ్డి సేమ్ టు సేమ్ రేవంత్ లాగే భూముల క‌బ్జా విష‌యంలో ఆరోప‌ణ‌లు చేశారు.

కొండాపూర్ లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భ‌త్వం గ‌తంలో ఇచ్చిన వంద ఎకరాల ల్యాండ్‌ను ఇప్ప‌డు తిరిగి తీసుకుంటోంద‌ని, అంతే కాకుండా అమ్మకానికి పెట్టిందని జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప్ర‌స్తుతం ఈ ఏరియాలో ఎకరం 3 కోట్లు ఉండ‌టంతో అధికార టీఆర్ ఎస్‌కు చెందిన మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు క‌లిసి ఈ భూముల‌ను కొట్టేసేందుకు ప్లాన్ వేశార‌ని తెలిపారు జ‌గ్గారెడ్డి.

"""/"/ దీనిపై ఇప్ప‌టికే తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఐఏఎస్ ఆఫీస‌ర్లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని, ఈ విష‌యంపై కోర్టుకు కూడా వెళ్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక ఇప్పుడు కేసీఆర్ ఎత్తుకుంటున్న ద‌ళిత రాగంపై కూడా కామెంట్లు చేశారు జ‌గ్గారెడ్డి.

మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన ఆర్.ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఈ విష‌యాల‌పై కేసీఆర్ ద‌ళితుల‌కు చేసిన అన్యాయంపై నిల‌దీయాల‌ని సూచించారు.

అప్పుడే ద‌ళితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తెలిపారు జ‌గ్గారెడ్డి.మొత్తానికి జ‌గ్గారెడ్డి రేవంత్ రెడ్డి చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేయ‌డం విచిత్రంగా అనిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.