ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా?

తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.

గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కూడా వారిని పట్టించుకోకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు ప్రభుత్వంకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు.హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోక పోవడంపై ఆయన ఆశ్చర్య వ్యక్తం చేశాడు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఒక్క ఆత్మహత్య కూడా ఉండకుండా చూస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నాడు అంటూ ప్రశ్నించాడు.

తెలంగాణలో ఉన్న పలు సమస్యల పట్ల ప్రభుత్వం కనీసం విజ్ఞత ప్రదర్శించడం లేదు అంటూ జగ్గారెడ్డి అన్నాడు.

అసలు ఆర్టీసీ కార్మికులు అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక వైపు రైతులు మరో వైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమ్మె విరమింపజేయాలంటూ కోరాడు.

నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్