ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాబోతున్నది యూపీఏ కూటమి ప్రభుత్వం అని, యూపీఏ కూటమిలో టీఆర్‌ఎస్, తెలుగు దేశం, వైకాపాలు కూడా జత కలుస్తాయని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేసింది.ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో అలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని, టీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్య చీకటి ఒప్పందం ఉందనే అభిప్రాయం జనాల్లో ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాజాగా జగ్గారెడ్డి స్పందించాడు.ఆమె చేసిన వ్యాఖ్యలకు తాను కౌంటర్ ఇవ్వబోను అన్నాడు.
ఆమె మాటలు తననేం ఆవేదనకు గురి చేయలేదని అన్నాడు.ఆమెకు పీసీసీ చీప్ కావాలనే కోరిక ఉన్నట్లుంది.
తప్పకుండా ఆమె కోరిక తీరుతుందనిపిస్తుంది.విజయశాంతి గారికి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆమె సెలబ్రెటీ అవ్వడం వల్ల కాంగ్రెస్‌కు కూడా ఆమె వల్ల ఉపయోగం.
ఆమె పార్టీ బాధ్యతలు చేపడితే తప్పకుండా ప్రయోజనం ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా ఈ సందర్బంగా జగ్గారెడ్డి అన్నాడు.