నాలుగు రోజులకే నా సినిమా ఎత్తేశారు.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జగపతిబాబు( Jagapathi Babu ) నటించిన రుద్రంగి సినిమా( Rudrangi Movie ) ఈ ఏడాది థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ఈ సినిమా రిజల్ట్ గురించి జగపతిబాబు మాట్లాడుతూ ఈ మూవీ కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని ఈ సినిమా కోసం పని చేశానని తెలిపారు.

ఈ సినిమాకు రసమయి బాలకిషన్ ( Rasamayi Balakishan )నిర్మాత కాగా ఆయన నిర్మాత అయినా సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదని జగపతిబాబు తెలిపారు.

సినిమా బాగా రావాలనే తపన వాళ్లలో నాకు కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ రీజన్ వల్ల నాలుగు రోజుల్లోనే రుద్రంగి మూవీని థియేటర్ల నుంచి తీసేశారని ఆయన అన్నారు.

అలా చేయడం వల్ల నా మూవీ దిక్కులేని అనాథ అయిందని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తీశారని నా రేంజ్ మూవీ కాకపోయినా నేను చేశానని ఆయన కామెంట్లు చేశారు.

"""/" / ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని నేను సూచనలు చేశానని అయితే నా సూచనలను వాళ్లెవరూ పట్టించుకోలేదని జగపతిబాబు తెలిపారు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా రుద్రంగి నా కెరీర్ లో బెస్ట్ మూవీ అని జగపతిబాబు కామెంట్లు చేశారు.

జగపతిబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ కామెంట్లపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

"""/" / జగపతిబాబు ప్రస్తుతం సలార్( Salar ) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాతో పాటు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఆయన చేతిలో ఉన్నాయని తెలుస్తోంది.

జగపతిబాబు రెమ్యునరేషన్ ప్రస్తుతం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

జగపతిబాబుకు తర్వాత సినిమాలతో సైతం భారీ స్థాయిలో విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

జగపతిబాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

పులినే తరిమికొట్టిన పెంపుడు కుక్క.. ఈ వీడియో చూస్తే..