శ్రీ తేజ్ ను పరామర్శించిన నటుడు జగపతిబాబు.. ఏమన్నారంటే?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి (Revathi) అనే అభిమాని మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీ తేజ్ (Sri Tej) తీవ్ర గాయాలపాలయ్యి ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వైద్యలు తెలియజేస్తూ ఉన్నారు.

ఇక ఈ ఘటన మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో భాగంగా ఏకంగా అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అయ్యే జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

ఇకపోతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉంటానని భరోసా కల్పిస్తానని కూడా తెలిపారు.

ప్రస్తుతం తన వైద్యానికి అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు.

తాను కూడా ఆ చిన్నారిని చూడటానికి వెళ్లాలని ఉంది కానీ కోర్టు కేసు కారణంగా వెళ్లలేకపోతున్నానని తెలిపారు.

"""/" / ఇకపోతే పుష్ప సినిమాలో నటించిన నటుడు జగపతిబాబు (Jagapathi Babu) సైతం తాజాగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించినట్లు తెలుస్తోంది.

అయితే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా జగపతిబాబు మాట్లాడుతూ.

తాను వేరే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను అయితే షూటింగ్ నుంచి రాగానే నేరుగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించి వచ్చాను కానీ పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టే విషయం ఎవరికీ తెలియదన్నారు జగపతి బాబు.

బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలనిపించి అక్కడికి వెళ్లా.ఆ దేవుడు, అందరి ఆశీస్సులతో త్వరగానే బాలుడు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చి వచ్చాను.

అందరికంటే ఎక్కువగా నష్టపోయింది బాధిత కుటుంబమే అందుకే నా వంతు వారికి సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నాను కానీ నేను పబ్లిసిటీ చేయకపోవడం వల్లే విమర్శలు వస్తున్నాయి.

ఆ విమర్శలకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నానని జగపతిబాబు ఈ వీడియో సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్