ఒళ్ళు బలిసి ఈ వీడియో పెట్టాను.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

హీరోగా ఈయన ఎన్నో అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలలో నటించారు.ఇలా కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్న జగపతిబాబు క్రమక్రమంగా సినిమా అవకాశాలను కోల్పోయారు.

ఇలా సినిమా అవకాశాలను కోల్పోయిన ఈయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు.కానీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెజెండ్ ( Lezend ) సినిమా ద్వారా విలన్ గా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

"""/" / ఈ సినిమాలో విలన్ పాత్రలో జగపతిబాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు వరుసగా విలన్ పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఈయన విలన్ పాత్రలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు.

ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

"""/" / ఏ విషయాన్ని దాచుకోకుండా నిర్మొహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈయన చేసే పోస్టులు సంచలనం అవుతుంటాయి.

తాజాగా జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఇందులో ఈయన ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను ఒక వీడియోగా మార్చి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేస్తూ బాగున్నానని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఒళ్ళు బలిసి ఈ వీడియోని షేర్ చేస్తున్నానని క్యాప్షన్ ఇచ్చారు.

ఇలాంటి క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.