Jagapathi Babu : మందు కొట్టమంటారా.. అభిమానులను అడిగిన స్టార్ హీరో..నెటిజన్స్ రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) ఒకరు.

ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.హీరోగా 100 సినిమాలలో నటించినటువంటి జగపతిబాబు అనంతరం అవకాశాలను కోల్పోయారు కానీ ఈయన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

"""/" / ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా తను ఇంట్లో పనులు చేస్తున్నటువంటి విషయాలను కూడా ఈయన అభిమానులతో పంచుకుంటారు.

ఏ విషయమైనా నిర్మొహమాటంగా అభిమానులకు చెప్పే జగపతిబాబు ఇటీవల తన పుట్టినరోజును ( Birthday ) జరుపుకున్నారు.

ఫిబ్రవరి 12వ తేదీ జగపతిబాబు పుట్టినరోజు కావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

"""/" / ఎలాగో పుట్టేసాను పుట్టినరోజు మందు కొట్టమంటారా లేక కూల్ డ్రింక్ తాగమంటారా అంటూ ఈయన ఒక చేతిలో మందు ( Alcohol ) బాటిల్ మరో చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని అభిమానులను సలహా అడుగుతూ తొందరగా చెప్పండి ఏది కొట్టమంటారు అంటూ ఈయన ఈ పోస్ట్ చేశారు.

దీంతో నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.అన్న ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు రెండు కలిపి కొట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!