2000 మంది ఉన్నారు…తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతారు: జగపతిబాబు

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు( Jagapathi Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన జగపతిబాబు ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు లెజెండ్ సినిమా ద్వారా విలన్ ( Villan ) గా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రస్తుతం ఈయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా పెద్ద ఎత్తున సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

"""/" / ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఏ విషయం నైనా ముక్కు సూటిగా మాట్లాడతారు తనకు నచ్చిన సమాధానం చెబుతూ ఉంటారు.

ఇక ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు.

తనకు కుల పిచ్చి అంటే ఏమాత్రం నచ్చదని ఎన్నో సందర్భాలలో తెలిపారు.అలాగే తన కుమార్తె విదేశీ వ్యక్తిని ప్రేమించిందనే విషయం తెలియడంతో పెళ్లి కూడా చేశారు.

"""/" / తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఒకసారి విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో ఓ ఈవెంట్‌కు వెళ్లానని, వేదిక మీద కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పాను.

దాంతో ఆయన వద్దని చెప్పారు.ఎందుకని తాను ప్రశ్నించగా.

ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారని, వీరంతా కమ్మోళ్లేనని మీరు ఒక్కరు.తేడా వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారని ఆయన హెచ్చరించినట్టు జగపతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)