ఆ సమయంలో ప్రభాస్ చాలా అండగా నిలబడ్డారు… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ హీరో జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా జగపతిబాబు ప్రభాస్( Prabhas ) గురించి ప్రభాస్ కుటుంబం గురించి మాట్లాడారు.

సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు( Krishnam Raju ) గారు, ప్రభాస్ మాత్రమే కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా గొప్ప వాళ్లేనని తెలియజేశారు.

కృష్ణంరాజు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వంలో మనం 20% నేర్చుకున్న చాలని ఈయన ఆ కుటుంబం పై ప్రశంసలు కురిపించారు.

"""/" / ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నప్పటికీ వారికి ఎన్ని అవార్డులు ఎన్ని పురస్కారాలు వచ్చినా వారిలో ఏమాత్రం గర్వం కనిపించదు.

ఒక ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సాధారణంగా ఉంటారని జగపతిబాబు ( Jagapathi Babu ) తెలియజేశారు.

ఇక ప్రభాస్ ఎవరికైనా సహాయం చేయాలి అంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనకు పంచడమే తప్ప తిరిగి అడగడం ఇప్పించుకోవడం అసలు తెలియదని జగపతిబాబు తెలియజేశారు.

ఇక ప్రభాస్ తో తనకు వ్యక్తిగతంగా ఒక మంచి అనుబంధము ఉందని కూడా ఈయన తెలియజేశారు.

"""/" / ఒకానొక సమయంలో నా ఇబ్బందుల కారణంగా నేను ఎంతో సతమతమవుతూ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను.

అలాంటి సమయంలో తనకు ప్రభాస్ ( Prabhas ) తో మాట్లాడాలనిపించింది.ఆ సమయంలో ఆయన జార్జియాలో ఉన్నారు.

నాతో చెప్పు డార్లింగ్ నేనున్నాను కదా అంటూ మాట్లాడారు.ఇక ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత వెంటనే నన్ను కలిశారు.

ఆ సమయంలో ప్రభాస్ మాటలు నాకు ఎంతో ఉపశమనం కలిగించాయి.ఆ విధంగా నేను డిప్రెషన్ లో ఉన్న సమయంలో ప్రభాస్ తనకు అండగా నిలిచి నన్ను ఆ సమస్య నుంచి డిప్రెషన్ నుంచి బయట పడేశారు అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?