జగన్ సాహస నిర్ణయం ! వారి మద్దతు పొందుతాడా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సాహసోపేతంగానే ఉంటున్నాయి.

అసలు అమలు సాధ్యమే కాదు అనుకున్న నిర్ణయాలను కూడా అమలు చేస్తూ తన పాలనను పరుగులు పెట్టిస్తున్నాడు.

క్లిష్టమైన ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ఔరా అనిపించుకుంటున్నాడు.ఒకవైపు ప్రతిపక్షాలను బెంబేలెత్తిస్తూనే మరోవైపు ప్రజల మద్దతు పొందుతూ ముందుకు వెళ్తున్నాడు.

ఇప్పుడు కూడా అదే డేరింగ్ స్టెప్ తో ముందుకు వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకోవడం సంచలనం రేపుతోంది.

ముఖ్యంగా మావోయిస్టు ల విషయంలో జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తేలాల్సి ఉంది.

"""/"/ మావోయిస్టుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ ద్వారా అనేక అంశాలపై చర్చించి నిర్నయాలు తీసుకోనుంది.లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు మావోయిస్టుల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర అంశాలపై ఈ కమిటీ నిర్ణయాలు తీసుకోబోతోంది.

మావోయిస్టుల నియంత్రణ వారి సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చినచబోతోందట.ఈ కమిటీకి చైర్మన్ గా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటారు.

కమిటీలో సభ్యులుగా హోంమంత్రి గిరిజన, రెవెన్యూ, ఆర్ అండ్ బీ మంత్రులకు చోటు కల్పించారు.

"""/"/ ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకుంది.

గతంలో జగన్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని గత టీడీపీ సర్కార్ హయాంలో హత్య చేసి కొంత అలజడి సృష్టించారు.

ఇక మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలని గతంలోనే మావోయిస్టులు డిమాండ్ చేశారు.

ఇపుడు జగన్ బాక్సైట్ జీవోను రద్దు చేయడంతో పాటు కీలక డిమాండ్ ను కూడా నెరవేర్చారు.

రాబోయే రోజుల్లో మావోయిస్టుల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

ఈ మొబైల్ నంబర్ శాపగ్రస్తమైనదా.. ముగ్గురు ప్రాణాలను బలిదీసుకుందిగా..??