ఏపీలో విజయం జగన్‎దే.. ఫ్యాన్ ప్రభంజనంతో టీడీపీ ఆశలు గల్లంతు..!

ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ ( YCP )హవా కనిపిస్తోంది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది.

సీట్ల ప్రకటన మొదలు ఇవాళ్టి వరకు ఫుల్ జోష్ లో ఉంది.ముందుగానే అభ్యర్థులను ప్రకటించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చిన వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ క్రమంలోనే ఏపీలో మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని టాక్ వినిపిస్తోంది.అత్యధికంగా లోక్ సభ స్థానాలను సాధించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుంధుభి మోగించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే పలు సంస్థలు మరోసారి వైసీపీ సర్కార్ వస్తుందని చెప్పగా.తాజాగా 147 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ తేల్చి చెప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలకు ఇంకా మరికొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్ష టీడీపీ( TDP ) ఓటమిని ఒప్పుకుంది.

రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 147 స్థానాల్లో వైసీపీ విజయం తథ్యమని స్పష్టం చేసింది.

నేషనల్ మీడియా సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు వెలువడించిన సర్వే ఫలితాలే కాకుండా ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ సమావేశంలోనూ ఇదే బయటపడింది.

టీడీపీ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో స్వయంగా ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్ ( Coordinator Koneru Suresh )నేతలకు వివరించారు.

147 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ సుమారు రెండు శాతం ఓట్ల తేడాతో ముందంజలో ఉందని టీడీపీ నేతలకు తెలిపారు.

వీటిలో ముఖ్యంగా 28 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమిపై సుమారు పది లక్షల ఓట్ల తేడాతో వైసీపీ విజయపథంలో కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నారు.

అంతేకాదు టీడీపీ - బీజేపీ -జనసేన( TDP - BJP - Jana Sena ) కలిసి వెళ్లినా వైసీపీని ఢీకొట్టడం సాధ్యమయే పని కాదని తేల్చడం గమనార్హం.

"""/" / అయితే, సామాజిక చైతన్య బస్సు యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్రా వంటి పలు రకాలు కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వస్తుంది.

ఆ తరువాత ఏపీలో నాలుగు చోట్ల ‘సిద్ధం’ పేరిట సభలను నిర్వహించిన వైసీపీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ సభలను నిర్వహించిన సమయంలోనే వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది.నవరత్నాల అమలు, మ్యానిఫెస్టోను( Manifesto ) 99 శాతం అమలు చేయడంతో పాటు విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో రాష్ట్ర ప్రజలంతా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు.

నాణ్యమైన విద్య, ఇంటి వద్దకే వైద్యం, సొంతింటి కల నెరవేర్చిన జగన్ ను పేద ప్రజలు తమ ఇంటిలో సభ్యునిగా భావిస్తున్నారు.

కులం, మతం, పార్టీ మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించడంతో ఆయన జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బాగా వీస్తుంది. """/" / మరోవైపు చంద్రబాబు బీజేపీ, జనసేనతో కలిసి వెళ్తున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది.

సభలకు సైతం జనాలు రాకపోవడంతో పార్టీ క్యాడర్ లో నిరుత్సాహం పెరిగిపోతుంది.పొత్తు నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సీట్ల వ్యవహారంలో రభస జరిగింది.

క్షేత్రస్థాయిలో క్యాడర్ లో సమన్వయం కొరవడింది.మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమిలో తిరుగుబావుటా మొదలుకావడంతో పాటు సర్వే ఫలితాల్లోనూ వైసీపీదే విజయం అని తేలడంతో టీడీపీ నిరాశలో కూరుకుపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో వైసీపీ గెలుపును తేల్చుతూ బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో అక్కడో ఇక్కడో టీడీపీ క్యాడర్ లో ఉన్న చిగురాశలు కూడా ఆవిరైయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రజాదరణ ఉన్న జగన్ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారని అర్థం అవుతుంది.

వైరల్ వీడియో: కొడుకు మొండితనానికి తండ్రీకొడుకులను విమానం నుంచి దించేసిన విమాన సిబ్బంది..